పెయింటింగ్ లో ఎక్కువగా వాడేది పువ్వులనే. వాటిలో ఉన్న అందం, రంగుల కలయిక అద్భుతమైనది అని చెప్పవచు. నేను కొన్ని పువ్వుల డిజైన్లు ఇస్తున్నాను. అవి పిల్లల టాప్స్ పై, కుర్తీస్ పై కాని. చున్నీల మీద కాని, లేదా చీరలకు బార్డర్ లా వేసుకోవచ్చు. లేదంటే ప్యాచ్ లా కూడా మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకొని పెయింటింగ్ చేసుకోవచ్చు. ముందుగా ఈ పువ్వులను తేలిగ్గా ఎలా పెయింటింగ్ చేయొచ్చో పైన వీడియోలో చూడండి. తర్వాత నేనిచ్చిన డిజైన్స్ చూడండి. ఆ తర్వాత మీ ఇష్టానుసారంగా మీ దుస్తులను డిజైన్ చేసుకోవచ్చు. 



పువ్వుల పెయింటింగ్.
Labels: పెయింటింగ్
చీరలపై అందమైన డిజైన్ మీకోసం...
ప్లెయిన్ చీరలమీద పెయింటింగ్ చేసుకోవడానికి అందమైన సులువైన డిజైన్ ఇది. ఇది బార్డర్ , మరియు కొంగు మీద వేసుకోవచ్చు. కొంగు మీద మీ ఇష్టం వచ్చిన డిజైన్ లో ఈ పువ్వులు వేయించుకోండి. ఇంట్లో వేసుకునే బదులు డిజైన్ బయట ప్రింట్ చేయించుకుంటే మేలు. చీరకు తగినట్టుగా పూల రంగులు ఎంచుకోండి. అన్నీ పర్ల్ కలర్స్. అవుట్ లైన్ కి 3D outliner వాడాలి. అవసరమనుకున్న చోట గ్లిట్టర్స్ వాడండి. పువ్వు మధ్యలో కుందన్స్ అంటించు కోవచ్చు.. లేదా ఓపికుంటే ముత్యాలు కుట్టండి. మీ చీర మీ ఇష్టం ఎలాగైనా తయారు చేసుకోండి. సృజనాత్మకతకు హద్దులేదు..
Labels: పెయింటింగ్
నెమలి పెయింటింగ్
ఈ అందమైన నెమలి చూడడానికి అందంగా ఉన్నా, పెయింటింగ్ చేయడం కాస్త కష్టమే. నేను ఈ డిజైన్ పట్టు చీర కొంగు మీద వేసాను. ఇంత పెద్ద డిజైన్ ఎలా అంటే. ఒక పత్రికలో వచ్చిన డిజైన్ తీసుకుని దాన్ని ముక్కలు చేసి , ఒక్కో ముక్క ఎన్లార్జ్ చేయించి చీర మీద ట్రేస్ చేశాను. ఈ డిజైన్ చూసుకుంటూ షేడింగ్ ఇవ్వండి. నిజంగా చాలా బావుంటుంది. శ్రమకు తగ్గ ఆత్మసంతృప్తి .. ఇంకా మీకు సందేహాలుంటే అడగండి తప్పకుండా చెప్తాను. ... ఇందిరా..
261 matallic gold
355 pearl metallic bronze
22 turquoise blue for body
White as seen in picture
Labels: పెయింటింగ్
గణేష్ పెయింటింగ్...2
ఈ పెయింటింగ్ కాస్త క్లిష్టమైనదే కాని శ్రద్ధ పెడితే కష్టమైనది కాదు. కాస్త ఎక్కువ ఓపికతో చేయాలి. పూర్తీ చేసాక శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది.
ముందుగా బాడీ కోసం క్రిమ్సన్, ఎల్లో తీసుకోవాలి. ఈ రెండు రంగులు కొద్ది కొద్దిగా కలుపుకుంటూ షెడ్ చూసుకోవాలి. సరియైన బాడీ కలర్ వచ్చేవరకు కొంచం కొంచం ఎల్లో కలపాలి.. అవుట్ లైన్ కోసం వైట్ కలర్ వాడాలి. మిగతా రంగులు చిత్రంలో ఉన్నవిధంగా వేసుకోవచ్చు. కలర్ లైట్ చేయాలంటే కొద్దిగా వైట్ కలర్ కలిపితే సరి. ఆకాశం లోని బూడిద రంగుకోసం తెలుపులో కొద్దిగా నలుపు రంగు కలిపి షెడ్ చూసుకోవాలి.
ముందుగా ఈ డిజైన్ ని పసుపు కార్బన్ పేపర్ తో బట్ట మీద దించుకోవాలి. జాగ్రత్తగా బాడీకి కావలసిన ఎరుపు రంగు వేయాలి.తర్వాత అందులోని వివిధ లైన్లని వైట్ కలర్ తో సన్నటి బ్రష్ తో జాగ్రత్తగా వేయాలి. అలాగే మిగతా కలర్స్ కూడా.. మిగతా రంగులు కూడా ఒక్కోట్టగా నింపి అవుట్ లైన్ వేయండి. ఆకాశం కోసం పైన చెప్పినట్టు కలుపుకుని వేయండి.. ఇదంతా ఒక్కరోజులు అయ్యే పని కాదు. కొత్తగా చేస్తున్నట్టయితే రోజు ఒక కలర్ వేయండి.
సూచన.. ఈ డిజైన్ ఇలాగే కావాలంటే ప్రింట్ తీసుకుని ట్రేసింగ్ పేపర్ తో కాపీ చేసుకోండి. పెద్దగా చేయాలనుకుంటే ఈ డిజైన్ ని ఎనలార్జ్ చేయించుకోవచ్చు.
Labels: పెయింటింగ్
పెయింటింగ్ బేసిక్స్... 1

పెయింటింగ్ గురించి బేసిక్ విషయాలు నేర్చుకుందాం.
కావలసిన ముఖ్యమైన వస్తువులు. పెయింట్లు, బ్రష్షులు గట్రా చూద్దామా...
బ్రష్షులు ;
flat brushes, round brushes
ఫ్యాబ్రిక్ కలర్స్ :
2 -black
4-crimson
3-chrome yellow
11-lemon yellow
15-mavue
18-pink
19prusian blue
21-sap green
22-turquoise blue
23 ultramarine blue
24-vermillon
27-white
Violet
పెయింటింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి పల్చటి, తక్కువ ధర కాటన్ లేదా పాప్లిన్ బట్ట తీసుకోకూడదు. టూబైటూ ఐతే మంచిది. నేత చిక్కగా ఉన్న బట్ట ఐతే రంగు పీల్చుకోదు. పల్చటి బట్ట ఐతే మనం పెయింటింగ్ వేయగానే రంగు పీల్చేసుకుని అసహ్యంగా అవుతుంది.
ఇక ఎంబ్రాయడరీ రింగులు కావాలి. కనీసం ఓ మూడు సైజులు. చిన్న, పెద్ద డిజైన్స్ వేయడానికి సరిపోయే సైజు చూసి తెచ్చుకోండి. చెక్కతో చేసిన రింగులకంటే ప్లాస్టిక్‌వి ఐతే మంచిది.
ట్రేసింగ్ పేపర్ : డిజైన్ ట్రేస్ చేసుకోవడానికి తప్పనిసరి కావాలి..
కార్బన్ పేపర్ : డిజైన్ బట్ట మీద దించుకోవడానికి ఈ పేపర్ కావాలి. ఇందుకు పసుపు లేదా తెలుపు కార్బన్ పేపర్లు మాత్రమే తీసుకోవాలి. డార్క్ కలర్ పేపర్ తీసుకోవద్దు.
ఇప్పుడు మనం వాడే రంగుల వర్గీగకరణ తెలుసుకుందాం.
Monochromatic colours:
Colours of a particular shade ranging from dark to light or light to dark
Tones :
Shades of black and white
More of black =darker shade
More of white=lither shade
1)Primary colours:
These colours cannot be made by mixing any two colours .
But by mixing there colours we can create other colours.
ex : red,yellow,blue.
2)secondary colours:
These are the colours created by mixing any two primary colours
Ex:- yellow + blue = green
Red + yellow = orange
Red + blue = purple
3)Intermediate colours:
These colours are created by mixing two primary colours in different ratios.
Ex:- red + yellow = orange
More of red + less of yellow = reddish orange
4)Tertiary colours:
These colours are created by mixing any two secondary colours.
Ex:- orange + green = citrus
(red + yellow) + ( yellow + blue )
Labels: పెయింటింగ్
పెయింటింగ్ - గువ్వల జంట
ఇప్పుడు బొమ్మ వేయడం నేర్చుకుందాం. పైన ఉన్నా బాతుల జంటలో ముఖ్యమైన రంగులు రాగి, నీలం, ఎరుపు.. వీటిని ఎలా కలుపుకోవాలో చూద్దాం.
crimson and vermillion for light orange ,
bronze+ gold ,
turquoise blue+white,
majenta: prussian blue+pink
to make majenta mix little blue +more of pink..
ముందుగా డిజైన్ ట్రేస్ చేసుకుని బ్లాక్ కలర్ తో ఔట్ లైన్ వేసుకోవాలి. తర్వాత పైన చెప్పిన విధంగా రంగులు కలుపుకుని మిగతా సారీరా భాగాలలో జాగ్రత్తగా నింపుకోవాలి. మొత్తం పెయింటింగ్ పూర్తయ్యాక తెలుసుగా.. పూర్తిగా ఆరిన తర్వాత వెనకవైపు ఇస్త్రీ చేసుకోవాలి.
Labels: పెయింటింగ్
పెయింటింగ్ నేర్చుకుందాం - ఓం గణేశాయ నమః
ఎలాగూ వేసవి సెలవులు వచ్చాయి. స్కూళ్ల గొడవలు లేవు. కాస్త తీరిక దొరుకుతుంది కదా. పెయింటింగ్ నేర్చుకుందామా.. ముందుగా సింపుల్ గా మొదలెడదాము. ఓం ప్రధమంగా గణేషుడితో ప్రారంభిద్దాం.
పెయింటింగ్ నేర్చుకోవడానికి టూ బై టూ బట్ట ఐతే మంచిది. కాటన్, పాప్లిన్ ఐతే కలర్ పీల్చుకుంటుంది. బట్టను ఉతికి , ఇస్త్రీ చేసి పెట్టుకోవాలి. తర్వాత డిజైన్ లైట్ కలర్ కార్బన్ పేపర్ తో దించుకోవాలి. బ్లూ, బ్లాక్ , రెడ్ ఐతే బాగోదు. బ్రష్... ఔట్‌లైన్ కోసం 00 round, ఫిల్లింగ్ కోసం 2 round అవసరమవుతాయి. .ఫ్యాబ్రిక్ కలర్ ఎప్పుడు కూడా డైరెక్టుగా వాడకూడదు. కొంచం ప్లేట్లో తీసుకుని ఒక చుక్క నీరు కలిపి పల్చగా కలుపుకుని వాడుకోవాలి. . ముందుగా పై చిత్రం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా డిజైన్ లో ఉన్న ఔట్‌లైన్ క్రిమ్‌సన్ కలర్ తో సన్నగా, ఒకే స్త్రోక్ ఇస్తూ వేయాలి. మధ్యలో రౌండ్ బ్రష్ తీసుకుని బ్రాస్ (పర్ల్) కలర్ కలుపుకుని జాగ్రత్తగా నింపాలి. పూర్తయ్యాక కనీసం అరగంట ఆరనివ్వాలి. ఆ పెయింటింగ్ వెనకవైపు నుండి ఇస్త్రీ చేసి పెట్టుకోవాలి. దానివలన కలర్ పటిష్టంగా అవుతుంది.
Labels: పెయింటింగ్