పిల్లలే పెద్దలైన వేళ....


హలో అత్తా!..
చెప్పరా చేతన్
మమ్మీ వాళ్ల సిల్వర్ జుబిలీ ఫంక్షన్ చెద్దామా?
సరే చేద్దాం. మమ్మీకి చెప్పావా మరి?
లేదు. చెప్తే వద్దు మనీ వేస్ట్ అంటుంది. డాడీ కూడా ఒప్పుకోడు. వాళ్లకు చెప్పకుండా చేద్దాం. ఇది నాది, అక్కది ఐడియా. నువ్వేమంటావ్?
సరే . ఇంటికి రా .. అన్నీ మాట్లాడదాం. అమ్మమ్మ , తాత కూడా ఉంటారు.

ఇలా ఒక వారం క్రింద మా ఆడపడుచు కొడుకు చేతన్ అడిగాడు. అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చి సంతోషపెట్టాలని ప్రయత్నించే వదినకు ఆమె పిల్లలే ఇంత మంచి బహుమతి ఇస్తా అంటే ఎవరు మాత్రం కాదంటారు. పిల్లలకు ఇంత కాలం అన్నీ మమ్మీ చేసిపెట్టేది. పార్టీకి ఏమేం కావాలి, ఎలా చేయాలి అని తెలీదుకదా. అందుకే అత్తయ్య ,మామయ్య, మావారు కలిసి ఆలోచించి ఎలాచేయాలో డిసైడ్ చేసారు. అత్తయ్య చేతన్ తో వెళ్లి వంటకు కావలసిన సామాన్లు, అన్ని కొనిచ్చింది. ఏదైనా క్లబ్ లోచేద్దామంటే కూడా వద్దు ఇంట్లోనే చేద్దాం అంటే వంట మనిషిని మాట్లాడాము. ఇదంటా ఇంట్లో చెప్పొద్దు అంటే మమ్మీకితెలీకుండా పని కాదు. చెప్పమంటే ముందు రోజు సాయంత్రం వాళ్ల మమ్మీకి చెప్పాడు. సరే అంది. డాడీకి మాత్రం ఊరికే దగ్గరచుట్టాలకు భోజనాలు పెడుతున్నాం అని చెప్పారు పిల్లలు...


రెండు వైపులా దగ్గర చుట్టాలకు ఇదీ సంగతి అని చెప్పారు చేతన్ , దీప్తి. మమ్మీ, డాడీలకు అసలు సంగతి చెప్పొద్దు , సస్పెన్స్ అని కూడా చెప్తే అందరూ అంగీకరించారు. పొద్దున్నే వంటలు మొదలయ్యాయి. నేను , మా తోటికోడలు, అత్తయ్య కలిసి వంటల బాధ్యత తీసుకున్నాం, చేతన్ మావారితో వెళ్లి, పెద్ద కేక్, నిలువెత్తు పూలదండ, డెకొరేషన్సామాన్లు తీసుకొచ్చాడు. ఇందులో అసలు వ్యక్తులకు ఏమీ మాట్లాడే చాన్స్ కూడా ఇవ్వలేదు. చెప్పినట్టు వినడమే వాళ్లపని. అరగంటలో పిల్లలంతా కలిసి హాల్ డెకొరేషన్ చేసారు. మొత్తం రెడీ అయ్యేవరకు అన్నయ్యకు తెలీదు. చూడగానేషాక్ అయ్యారు, ఇదేంటి అని.. అలాగే కూర్చోబెట్టి పిల్లలు అమ్మా నాన్నకు తాము తెచ్చిన కొత్త బట్టలు పెట్టి. అవివేసుకునేలోగా కేక్ , పూలదండలు అవి సర్ది పెట్టారు. అందరూ భలే ఆనందించారు. కేక్ అయ్యాక, నిలువెత్తు పూలడండవేసి పాదాభివందనం చేసారు దీప్తి, చైతన్య. అందరూ అక్షింతలు, పూలతో ఆశీర్వదించారు . తర్వాత భోజనాలు, ఆదివారం, హైదరాబాదు అంటే ముఘ్లాయీ స్పెషల్స్ కదా . బిర్యాని, సాస్ చికెన్, మిర్చి కా సాలన్, దాల్చ, కుర్బాని కామీటా, ఐస్ క్రీం, పాన్.... అందరూ సంతృప్తిగా భోజనాలు చేసి పిల్లలను దీవించి , మీ పెళ్లిల్లు చేసుకోండి. మళ్లీ మీ మమ్మీ, డాడీకి పెళ్లి చేయండి అప్పుదు ఇలాగే వస్తాము అంటూ ఒక్కరొక్కరు వీడ్కోలు పలికారు.


ఇది ఒక కుటుంబ వ్యవహారమే. కాని ఇక్కడ తల్లితండ్రులకు మరపురాని బహుమతి , ఆనందం ఇవ్వాలనితాపత్రయపడిన పిల్లల గురించి చెప్పాలనే నా చిన్ని ప్రయత్నం. పిల్లల కోసం తల్లితండ్రులు ఎంత కష్టపడ్డారో, పిల్లలుకూడా చిన్నప్పటినుండి ఎంత కష్టపడి చదువుకుని, మంచి ఉద్యోగాలలో సెటిల్ అయ్యారో నాకు తెలుసుగా. మీలో కూడాకొందరికి తెలుసనుకుంటా.. ఫంక్షన్ కి మీ ఫ్రెండ్స్ ని పిలువు అని వదినతో అంటే వద్దులే, ఫ్రెండ్స్ అని నమ్మితే నన్నుమోసం చేసారు కొందరు, మిగతావారు అంతా వెజిటేరియన్ వదిలేయ్ అంది. తర్వాత కూడా బ్లాగులో ఇవ్వలేదేంటి అంటేమూడ్ లేదు అంది. అవునూ ... ఇంతకీ మా వదిన ఎవరో అర్ధమైందా. మీ అందరికి ఆత్మీయురాలైన జ్యోతిగారే. ఇక్కడఎందరో ఆమెను అభిమానించేవారు, గౌరవించేవారు ఉన్నారని నాకు తెలుసు. విశేషాలను మీతో పంచుకోకపోతేఎలాగ మరి. అందుకే మా వదినకు తెలీకుండా, పోస్ట్ రాస్తున్నాను. సాయంత్రం మా పుట్టింటికి వెళుతున్నా. . ఇలాతనకు చెప్పకుండా టపా రాసి, ఫోటోలు పెట్టానని తెలిస్తే నా పని గోవిందా.. అందుకే వారం దాకా తనకు దొరకనుగా. ఉంటా మరి బై..

6 కామెంట్‌లు:

పరిమళం 26 మే, 2009 2:35 AMకి  

పెళ్లిరోజును ఇంత గ్రాండ్ గా చేసిన దీప్తి ,చేతన్ లకు అభినందనలు ...మీకూ అభినందనలు మాకు కన్నులపండుగ చేసినందుకు .....
@ జ్యోతి గారూ ! మీరు చెప్పక పోయినా మాకు తెలిసిపోయిందోచ్ ....

మాలా కుమార్ 26 మే, 2009 3:25 AMకి  

దీప్తి,చెతన్ ల కు అభినందనలు.
good keepit up.

మీకు థాంక్స్.

హరే కృష్ణ 26 మే, 2009 3:44 AMకి  

దీప్తి ,చేతన్ లకు అభినందనలు..జ్యోతి గారు ఇంతమంచి ఆత్మీయులని పొందడం మీ అదృష్టం
దీప్తికి మా కృతజ్ఞతలు..మరియు జ్యోతి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు

భావన 27 మే, 2009 10:41 AMకి  

దీప్తి, చేతన్ అభినందనలు. అమ్మ వాళ్ళ రజతోత్సవం ఇంత బాగా చేసినందుకు. జ్యోతి గారు మీరు ఇక పాడు కోవాలి " పుత్రోత్సాహం తండ్రికి" అని. :-)

జ్యోతి 28 మే, 2009 12:11 AMకి  

పరిమళంగారు, మాలా కుమార్ గారు, ధన్యవాదాలు.
హరేకృష్ణగారు, ఇక్కడ బ్లాగ్లోకంలో కూడా ఎంతో మంది ఆత్మీయులు ఉన్నారండి. మీకు థాంక్స్..
భావనగారు, థాంక్స్.. పుత్రోత్సాహం ??? పుత్రిక మరి?? తండ్రికేనా ఉత్సాహం??? :)))

psm.lakshmi 30 మే, 2009 11:12 AMకి  

jyothi,
Best wishes and many more happy returns. Congratulations to children.
psmlakshmi

నాకు తెలిసిన అభిరుచులు, ఆలోచనలు మీతో పంచుకోడానికి ఈ వేదిక....