ఈ పెయింటింగ్ కాస్త క్లిష్టమైనదే కాని శ్రద్ధ పెడితే కష్టమైనది కాదు. కాస్త ఎక్కువ ఓపికతో చేయాలి. పూర్తీ చేసాక శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది.
ముందుగా బాడీ కోసం క్రిమ్సన్, ఎల్లో తీసుకోవాలి. ఈ రెండు రంగులు కొద్ది కొద్దిగా కలుపుకుంటూ షెడ్ చూసుకోవాలి. సరియైన బాడీ కలర్ వచ్చేవరకు కొంచం కొంచం ఎల్లో కలపాలి.. అవుట్ లైన్ కోసం వైట్ కలర్ వాడాలి. మిగతా రంగులు చిత్రంలో ఉన్నవిధంగా వేసుకోవచ్చు. కలర్ లైట్ చేయాలంటే కొద్దిగా వైట్ కలర్ కలిపితే సరి. ఆకాశం లోని బూడిద రంగుకోసం తెలుపులో కొద్దిగా నలుపు రంగు కలిపి షెడ్ చూసుకోవాలి.
ముందుగా ఈ డిజైన్ ని పసుపు కార్బన్ పేపర్ తో బట్ట మీద దించుకోవాలి. జాగ్రత్తగా బాడీకి కావలసిన ఎరుపు రంగు వేయాలి.తర్వాత అందులోని వివిధ లైన్లని వైట్ కలర్ తో సన్నటి బ్రష్ తో జాగ్రత్తగా వేయాలి. అలాగే మిగతా కలర్స్ కూడా.. మిగతా రంగులు కూడా ఒక్కోట్టగా నింపి అవుట్ లైన్ వేయండి. ఆకాశం కోసం పైన చెప్పినట్టు కలుపుకుని వేయండి.. ఇదంతా ఒక్కరోజులు అయ్యే పని కాదు. కొత్తగా చేస్తున్నట్టయితే రోజు ఒక కలర్ వేయండి.
సూచన.. ఈ డిజైన్ ఇలాగే కావాలంటే ప్రింట్ తీసుకుని ట్రేసింగ్ పేపర్ తో కాపీ చేసుకోండి. పెద్దగా చేయాలనుకుంటే ఈ డిజైన్ ని ఎనలార్జ్ చేయించుకోవచ్చు.
గణేష్ పెయింటింగ్...2
రాసింది
ఇందిర
13 మే, 2009
Labels: పెయింటింగ్
1 కామెంట్‌లు:
వక్ర తుండమహాకాయ కోటి సూర్యసమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వధా !!
కామెంట్‌ను పోస్ట్ చేయండి