పెయింటింగ్ నేర్చుకుందాం - ఓం గణేశాయ నమః

 
ఎలాగూ వేసవి సెలవులు వచ్చాయి. స్కూళ్ల గొడవలు లేవు. కాస్త తీరిక దొరుకుతుంది కదా.   పెయింటింగ్ నేర్చుకుందామా.. ముందుగా సింపుల్ గా మొదలెడదాము. ఓం ప్రధమంగా గణేషుడితో ప్రారంభిద్దాం.


పెయింటింగ్ నేర్చుకోవడానికి టూ బై టూ బట్ట ఐతే మంచిది. కాటన్, పాప్లిన్ ఐతే కలర్ పీల్చుకుంటుంది. బట్టను ఉతికి , ఇస్త్రీ  చేసి పెట్టుకోవాలి. తర్వాత డిజైన్ లైట్ కలర్ కార్బన్ పేపర్ తో  దించుకోవాలి. బ్లూ, బ్లాక్ , రెడ్ ఐతే బాగోదు.  బ్రష్... ఔట్‌లైన్ కోసం  00 round,  ఫిల్లింగ్ కోసం  2 round అవసరమవుతాయి. .ఫ్యాబ్రిక్ కలర్ ఎప్పుడు కూడా డైరెక్టుగా వాడకూడదు. కొంచం ప్లేట్లో తీసుకుని ఒక చుక్క నీరు కలిపి పల్చగా కలుపుకుని వాడుకోవాలి. . ముందుగా పై చిత్రం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా డిజైన్ లో ఉన్న ఔట్‌లైన్ క్రిమ్‌సన్ కలర్ తో సన్నగా, ఒకే స్త్రోక్ ఇస్తూ వేయాలి. మధ్యలో రౌండ్ బ్రష్ తీసుకుని బ్రాస్ (పర్ల్)  కలర్ కలుపుకుని జాగ్రత్తగా నింపాలి. పూర్తయ్యాక కనీసం అరగంట ఆరనివ్వాలి. ఆ పెయింటింగ్ వెనకవైపు నుండి ఇస్త్రీ చేసి పెట్టుకోవాలి. దానివలన కలర్ పటిష్టంగా అవుతుంది.  

3 కామెంట్‌లు:

మధురవాణి 15 ఏప్రిల్, 2009 3:54 AMకి  

గణేశుడి పెయింటింగ్ చాలా బాగుంది. రంగుల ఎంపిక చక్కగా కుదిరింది.

మాలా కుమార్ 15 ఏప్రిల్, 2009 5:13 AMకి  

బాగుంది.వేయటాని కి సులువుగా వుంది.

Satyasuresh Donepudi 21 ఏప్రిల్, 2009 4:04 AMకి  

ప్రియదర్శిని గారు,
మీ పైయింటింగ్ సింపుల్ గా చాలా బాగుంది.

నాకు తెలిసిన అభిరుచులు, ఆలోచనలు మీతో పంచుకోడానికి ఈ వేదిక....