పాటల సందడి - తకిట తధిమి తందాన



తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయలయల జతుల గతుల తిల్లాన
తడబడు అడుగుల తప్పని తాళాల
తడిసిన పెదవుల రేగిన రాగాల
తడబడు అడుగుల తప్పని తాళాల
తడిసిన పెదవుల రేగిన రాగాల
శృతిని లయని ఒకటి చేసి
(తకిట తదిమి)
నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన
ఆరెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన
నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన
ఆ రెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన
తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా
తెలిసీ తెలియని ఆశల వయసీ వరసా
తెలుస మనసా నీకిది తెలిసీ అలుసా
తెలిసీ తెలియని ఆశల లలలలలలా
ఏటి లోని అలలవంటి కంటి లోని కలలు కదిపి గుండియలను అందియలుగ చేసి
(తకిట తదిమి)
పలుకు రాగ మధురం నీ బ్రతుకు నాట్య శిఖరం
సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం
పలుకు రాగ మధురం నీ బ్రతుకు నాట్య శిఖరం
సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం
అలరులు కురియగ నాడెనదే అలకల కులుకుల అలమేల్‌మంగ
అలరులు కురియగ నాడెనదే ఈ ఈ అలకల కులుకుల అలమేల్‌మంగ
అన్న అన్నమయ్య మాట అచ్చ తేనె తెలుగు పాట పల్లవించు పద కవితలు పాడి
(తకిత తదిమి)

చిత్రం : సాగరసంగమం
గానం : బాలు
సంగీతం: ఇళయరాజా
రాసింది : తెలీదు మరి.. 
 



ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం.. పాట సాహిత్యం, సంగీతం, బాలు గారి గానం, కమల్ హసన్ నాట్యం(నటన) .. వెరసి ఒక అద్భుతం అని చెప్పవచ్చు. నేను మీలా అందంగా చెప్పలేను. నేర్చుకుంటున్నాను మెల్లిగా...  ఎప్పుడో పాతికేళ్ల క్రింద సినిమా ఐనా,  ఎన్నిసార్లు చూసినా తనివితీరదు, బోర్ కొట్టదు.. హేమాహేమీలందరు కలిసి మనకోసం ఈ కళాఖండాన్ని అందించారు..
మళ్లీ ఆ రోజులు వస్తాయా?? ఈ సినిమా  చూస్తుంటే అలా మైమరచిపోతా నేనైతే .
ఇక నా గురించి చిన్న పరిచయం.. ఇది నా మొదటి పోస్టు.నేను ఇలా బ్లాగు రాయడానికి కారణం మా ఆడపడుచు. అసలు నాకు సినిమాలు, టీవీ సీరియళ్లు చూడడం చాలా ఇష్టం.. కొంత కాలం క్రిందవరకు మేమిద్దరం కుట్లు, అల్లికలు, పేయింటింగ్, షాపింగ్, సీరియళ్ల డిస్కషన్ అన్నీ కలిసి చేసేవాళ్లం. కాని తనేమో వేరే పనిలో బిజీ ఐపోయింది. నేను టీవీ సీరియళ్లు మరింత సీరియస్సుగా , మిస్సవకుండా చూడసాగాను. (ఇంట్లో పెద్దవాళ్లు తిడుతున్నా ) మా వదిన కూడా నన్ను తిట్టేది. ఊరికే ఏం టీవీ చూస్తావ్ , తెలుగు రాయడం నేర్పిస్తాను. రాయి అని ఎన్నోసార్లు చెప్పింది. ఇంట్లో ఎలాగూ కంప్యూటర్ ఉందిగా ఎందుకు టైం వేస్ట్ చేస్తావు. నేర్చుకో అని అన్నీ నేర్పించింది. ఇక లాభం లేదని, ఈ టీవీ పిచ్చి వదిలించుకోవాలని.. ఈటీవీ సఖిలొ బ్లాగుల గురించి వచ్చిన ప్రోగ్రాం చూసి  ఈ బ్లాగు మొదలెట్టాను. కాని దానిని అలంకరించి ఏమేం రాయాలో చెప్పింది మా ఆడపడుచే. ఇప్పుడైతే తను ఇచ్చిన టాపిక్ తో రాసాను. నేను మీ అందరిలా రాయలేను. తప్పులుంటే సారీ.. ఇంకా ముందు ముందు ఏమేం రాస్తానో నాకే తెలీదు. ఇలా మొదలెట్టి ఊరుకుంటే నా పని ఐపోతుంది.. అమ్మో.. ఇంతకీ నా బద్ధకాన్ని వదిలించేందుకు కంకణం కట్టుకున్న మహిళ ఎవరొ తెలుసా?? మీకందరికి తెలిసిన జ్యోతి...  నన్ను టీవీ ముందునుండి తరిమేసే బాధ్యత ఆవిడకే అప్పచెప్పా, నేను మా ఇంట్లోవాళ్లు. వాళ్లు కూడా విసిగిపోయారు మరి.. నేనేం చేసేది వంట, పిల్లలకు, భర్తకు, అత్తామామలకు అన్నీ అమర్చడం తప్ప వేరే పనేముంటుంది..   నా పేరు చెప్పలేదు కదూ... ఇందిర  ప్రియదర్శిని..   

7 కామెంట్‌లు:

పరిమళం 10 ఏప్రిల్, 2009 12:14 AMకి  

ఇందిర గారు , మొదటి పోష్టే మంచి పాటతో అడుగుపెట్టారు .all the best !

Vinay Chakravarthi.Gogineni 10 ఏప్రిల్, 2009 1:08 AMకి  

goodone......narudibratuku natana eeswaruni talapu ghatana ani enta baaga chepparu simple ga life gurinchi veturi gaaru........


good carryon alll the best

జ్యోతి 10 ఏప్రిల్, 2009 1:10 AMకి  

వేరీ గుడ్ ఇందిర..

రాస్తూ ఉంటే అదే అలవాటవుతుంది.. నీ పెయింటింగ్స్ కూడా పెట్టు..

మధురవాణి 10 ఏప్రిల్, 2009 2:57 AMకి  

ప్రియదర్శిని గారూ..
బ్లాగ్ లోకానికి స్వాగతం.
నాకు ఈ పాట గురించి వినగానే వీడియో చూడాలనిపిస్తుంది.
నా ఆలోచన ముందుగానే కనిపెట్టేసినట్టుగా మీరు వీడియో కూడా పెట్టేసారు.
ధన్యవాదాలు.

మాలా కుమార్ 10 ఏప్రిల్, 2009 8:01 AMకి  

ప్రియదర్శిని గారు,

మంచి పాట తొ ఏంట్రి ఇచ్చారు.బెస్ట్ ఆఫ్ లక్.

Bhãskar Rãmarãju 10 ఏప్రిల్, 2009 10:01 AMకి  

ఇందిర గారు
>>నేను మీ అందరిలా రాయలేను. తప్పులుంటే సారీ.. ఇంకా ముందు ముందు ఏమేం రాస్తానో నాకే తెలీదు.
అబ్బే, ఆదిలోనే ఇలా అంటే ఎలా? రాసి అవతలెయ్యాలి ఏదైనా దేన్నైనా. రాయటానికేదీ అనర్హం కాదు. కిటికీలోంచి బయటకి చూస్తున్నారు, పిల్లలు ఆటలు ఆడుతున్నారు ఆ పక్కన, మీకు చిన్నప్పుడు మీరు ఆడుకున్న ఆటలు గుర్తుకొచ్చినై. రాసేయండి. :):)
"నేను బాగా రాయగలను" అనే అనుకోండి ఎప్పుడూనూ. అదే మీకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.
మొదటిపోస్టే అదరగొట్టేసారు. శుభం.

krishna rao jallipalli 11 ఏప్రిల్, 2009 10:42 AMకి  

ఇంకా ముందు ముందు ఏమేం రాస్తానో నాకే తెలీదు.... చాల గొప్పగా రాయగలరు. ఎందుకంటే మీ టేస్టు మీరు ఎంచుకున్న పాటలోనే కనబడింది మరి. మీరు మొదటి పోస్టే చాలా చక్కగా రాసారు, అంతకంటే చక్కగా మిమ్ములని మీరు పరిచయం చేసుకున్నారు. good. రాస్తూ ఉండండి.. తెలుగులోనే.

నాకు తెలిసిన అభిరుచులు, ఆలోచనలు మీతో పంచుకోడానికి ఈ వేదిక....