దొండకాయ వేపుడు అందరికి తెలిసిందే .అదే వేపుడును కాస్త వెరయిటీగా చేసుకుందామా..దొండకాయలను సన్నగా దారాల్లాగా కట్ చేసుకోవాలి. వీటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకోని పక్కన పెట్టుకోండి. మరో ప్యాన్ లో నూనె వేడి చేసి ఎండుమిరపకాయలు,ఆవాలు,జీలకర్ర వేసి చిటపటలాడాక కాస్త ఎక్కువ శనగపప్పు, పల్లీలు వేసి దోరగా వేయించండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మెత్తబడేవరకు వేయించండి. వేయించిన దొండకాయ ముక్కలు, పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టకుండా ఐదునిమిషాలు వేయించండి. చివరలో కొత్తిమిర చల్లి వేడిగా వడ్డించండి. అన్నంలోకి బానే ఉంటుంది కాని రొట్టెలకు మాత్రం గిన్నెలోకూర మిగిలితే ఒట్టు.. రొట్టెలే మిగలొచ్చు..
వనభోజనాలు అంటే కూరలు,పప్పులు మాత్రమేనా కాస్త నంజుకోవడానికి పకోడీలు ఉంటే బాగుంటుంది అని ఇవి చేశాను. మామూలుగా ఉల్లి పకోడీ, పాలకూర పకోడీలు చేసుకుంటాము కదా. రెండుకలిపితే పోలా అని కలిపేసా. పాలకూర కడిగి ఆరనిచ్చి సన్నగా తరగాలి. అలాగే ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి ,చేత్తో పొడి పొడిగా అయ్యేట్టు చిదుముకొవాలి. ఇందులో సెనగపిండి వేయండి. మరీ ఎక్కువ కాకుండా,మరీ తక్కువ కాకుండా. అలాగే మీకు కావలసినంత ఉప్పు, కారం, ధనియాలపొడి, పసుపు, సన్నగా తరిగిన కరివేపాకు, చెంచాడు వాము , ఇష్టముంటే చెంచాడు అల్లం వెల్లుల్లి ముద్దా వేసి మొత్తం బాగా కలపండి. ఉల్లిపాయల తడి సరిపోతుంది. వేరే నీళ్లు పోయనవసరం లేదు. బాణలిలో నూనె వేడిచేసి ఈ పిండి చేత్తో పొడిపొడిగా వేయండి.ముద్దలుగా వేయొద్దు . రెండువైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీసి పేపర్ పై వేయండి. కొద్ది సేపాగి సర్వ్ చేయండి.
11 కామెంట్‌లు:
అందరూ ఒకేసారి వంటలు చేసేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారే!
ఇందిర గారు దొండకాయ బలే వుందండి కారం గ వుండేటట్లు వుంది కదా. అబ్బ పకోడీలు... వెయ్యండి వెయ్యండి ప్లేట్ లో..
bhaagundi ...chesi tiraali
ఇందిర గారూ, ఈ దొండకాయ వేపుడు మాకు డిగ్రీలో ఉండగా హాస్టలులో పెట్టేవాళ్ళు..ఆ రోజు అందరం ఒకటికి మూడు కప్పుల కూర తినేసేవాళ్లం..వట్టిది తిన్నా బాగుంటుంది. మా పిల్లలకి కూడా బాగా ఇష్టం..కానీ ఆ దొండకాయలు ఎన్ని కోసినా గిన్నెడు కూర అవదు! ఈ దొండకాయ ముక్కలతో కాసిని పకోడీలుగా వేసి ఇందులో కలుపుతుంటాను. ఆ పాలకూర పకోడీలు కూడా నాలుగు ఇందులో వేసెయ్యండి..కాంబినేషన్ బాగుంటుంది.
ఈ దొండకాయ వేపుడు చేస్తే పిల్లల దగ్గరే అయిపోతుంది . అమ్మయ్య దగ్గరలో పిల్లలు లేరు , మనం లాగించేయొచ్చు!
మీ దొండకాయ వేపుడు అదిరింది. పకోడీ బ్రమ్హాండంగా ఉంది.
thanx
ఇందిరగారూ,
రెండూ కూడా చాలా బాగున్నాయి
ఇందిర గారు బావుందండి మీవంట
అబ్బ ఆపకోడీలు చూస్తుంటె నొరూరిపొతొందండి బాబు భలే చెసారు
www.tholiadugu.blogspot.com
బాగుందండీ..
ఈ టైపు దొండకాయ వేపుడు అచ్చమైన తెలంగాణ వంట అనుకుంటా. నేనిది కోస్తావేపు ఎప్పుడూ చూళ్ళేదు. ఇదే పద్ధతిలో బెండకాయ కూడా చూశాను. ఏదైనా కూరని సన్నగా పొడుగ్గా ముక్కలు తరగడాన్ని "jUliyen" అంటారు.
పకోడీలు ఫొటోలోనే నోరూరించేస్తున్నాయి!!
కామెంట్‌ను పోస్ట్ చేయండి